01-12-2025 09:42:05 PM
గంభీరావుపేట క్రైమ్ (విజయక్రాంతి): భూవివాదంలో వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం మేరకు 27 నవంబర్ గురువారం రోజున గోల్నేటి వెంకట నర్సు, గోల్నేటి దేవేందర్, దేవేందర్ భార్య గోల్నేని కవిత కలిసి గ్రామానికి చెందిన గోల్నేటి నర్సయ్యపై కట్టెలతో దాడి చేయగా, నర్సయ్య తలకు తీవ్రమైన గాయం తగిలింది. అడ్డుకునేందుకు వచ్చిన నర్సయ్య కొడుకులు గోల్నేని కర్ణాకర్, గోల్నేని చందు, నర్సయ్య భార్య లక్ష్మీ లను కూడా కట్టెలతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దేవేందర్, నరసవ్వ, కవితలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.