calender_icon.png 1 December, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించండి ఎమ్మెల్యే గారు

01-12-2025 10:34:39 PM

నేను కట్టిన ఫీజు ఇప్పించి ఆదుకోండి సార్

విద్యార్థిని సాత్విక ఆవేదన

కామారెడ్డి (విజయక్రాంతి): నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించండి ఎమ్మెల్యే గారు.. నేను కట్టిన ఫీజు ఇప్పించి ఆదుకోండి సార్ అంటూ ఫార్మసీ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో నా యొక్క స్టడీ సర్టిఫికెట్ ఉన్నాయి, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నా యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇప్పించగలరని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన విద్యార్థిని మఠం సాత్విక ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మఠం సాత్విక మాట్లాడుతూ లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మఠం సాత్విక మాట్లాడుతూ ఇంటర్మీడియట్ గీతా జూనియర్ కళాశాల మెదక్ జిల్లాలో చదవడం జరిగిందని, ఇంటర్మీడియట్లో నాకు 16 వేల ర్యాంకు రావడం జరిగిందని, నేను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేడ్చల్ జిల్లాలో తేదీ 22/10/2025 రోజున మొదటి సంవత్సరం కొరకు 54 వేల రూపాయలు కట్టి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని అన్నారు.

నా దురదృష్టవశత్తు మా నాన్న చనిపోవడం, మా అమ్మకు  యాక్సిడెంట్ కావడంతో మా అమ్మను ఎవరు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారని , మా ఆర్థిక సోమత బాగాలేదు అందుకని నేను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేడ్చల్ లో కట్టిన 54 వేల రూపాయలు, నా యొక్క స్టడీ సర్టిఫికెట్ ఇప్పించగలరని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని చేతులెత్తి వేడుకుంటున్నాను అన్నారు. నేను ఒకే ఒక్క కూతురును మా అమ్మను ఎవరు చూసుకునే వారు లేరు అందుకని ఎలారెడ్డి ఎమ్మెల్యే మదనమోహన్ రావు నా యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఇప్పించగలరని వేడుకుంటున్నాను అన్నారు.