calender_icon.png 1 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లిన డీసీఎం

01-12-2025 10:41:05 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎం వాహనం నార్కట్ పల్లి పట్టణంలో నలగొండ చౌరస్తా వద్ద అదుపు తప్పి ఎదురుగా ఉన్న షాప్ లోకి దూసుకు వెళ్లింది. చౌరస్తాలో డీసీఎం టర్నింగ్ చేస్తుండగా అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయాలైన వారిని స్థానిక కామినేని హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదం పై నార్కట్ పల్లి  పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం..