03-12-2025 12:00:00 AM
పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
కొలంబో, డిసెంబర్ 2: వరదల కారణంగా ఎంతో నష్టపోయి ఉన్న శ్రీలంకకు ఆపన్నహస్తం అందించేదుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ జాబితాలో తాజా గా పాకిస్థాన్ కూడా చేరింది. అయితే.. పాక్ ప్రభుత్వం పంపించిన ఆహారం, మెడికల్ కిట్స్‌తోపాటు ఇతర సామగ్రి నాణ్యతపై వి మర్శలు వెల్లువెత్తతున్నాయి.
పాకిస్తాన్ హైకమిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లోనే ఈ సామగ్రిపై గడువు ముగిసిన తేదీలు కనిపించడం గమనార్హం. ఆ వస్తువు లు పంపించడంపై ‘పాక్’ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నది. గడువు ముగిసిన వస్తువులను పంపించి విపత్తు బాధితులను పాకిస్థాన్ అగౌరవపరిచిందని విమర్శకులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.