calender_icon.png 3 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూకే నుంచి భారతీయుల తిరుగుపయనం

03-12-2025 12:00:00 AM

-అక్కడ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం

-జూన్ నాటికి యూకే వీడిన వారి సంఖ్య 74,000 మంది

లండన్/హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం.. మెరుగైన కెరీర్ కోసం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లిన భారతీయుల్లో పెద్దఎత్తున వెనుదిరుగుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఇప్పుడున్న వేవ్ అతిపెద్దదని విశ్లేషకులు చెప్తున్నారు. యూకే ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అత్యంత కఠినతరం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి యూకే నుంచి సుమారు 74,000 మంది భారతీయులు తిరుగుపయనమైనట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వీరిలో స్టడీ వీసాలపై వెళ్లిన వారు 45,000 మంది, పని వీసాలపై వెళ్లిన వారు 22,000 మంది. ఇతర వీసాలపై వెళ్లినవారు 7,000 మంది.

తిరుగుపయనంలో భారతీయులు ప్రథమస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో చైనీయులు ఉన్నారు. యూకే నుంచి 42,000 మంది చైనీయులు తిరుగుపయనమయ్యారు. వలసల రేటు 80శాతం నమోదైందని అక్కడి అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 తర్వాత ఇదే అతిపెద్ద వలసల వేవ్ అని స్పష్టం చేస్తున్నాయి.

పనిపరమైన వీసాలు, పోస్ట్- స్టడీ వర్క్ వీసాలకు సంబంధించిన నిబంధనలు కఠినతరంగా మారిన తరుణంలో విద్యార్థులు, ఉద్యోగులు వాటికి తాళలేక స్వస్థ లాలకు వెళ్తున్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు కంపెనీలు ఎక్కువ వేతనాలు ఇవ్వాలనే మార్గదర్శకాలు, పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకెళ్లడంపై నిషేధం ఉండటం ఇతర కారణాలు.