calender_icon.png 1 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రంలో కాలంచెల్లిన పాలు సరఫరా

01-10-2025 12:21:02 AM

ఆందోళన వ్యక్తం చేసిన బాలింతలు

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 30 (విజయక్రాంతి)అంగన్వాడి సెంటర్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సుమారు మూడు నెలల క్రితమే కాలం చెల్లిన పాలను గర్భిణీలు, బాలింతలకు అంటగడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ బాలింతకు ప్రభుత్వం సరఫరా చేసే పాలను కాలం చెల్లినవి గర్భిణీ, బాలింతలకు అంటగట్టడంతో అది తెలియక ఇంటికి తీసుకువెళ్లి పాలు కాచి తాగేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో పాలు పూర్తిగా పగిలిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు కాలం చెల్లినవిగా గుర్తించారు. ఇదేంటని సదురు అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు సదరు బాలింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై డిడబ్ల్యుఓ రాజేశ్వరిని ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకిరాలేదు.