calender_icon.png 1 October, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవాలు

01-10-2025 12:22:31 AM

మాగనూరు సెప్టెంబర్ 30. హిందువుల ఐక్యత మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అని కవి రచయిత శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మాగనూరు మండలం వడ్వా టు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శతాబ్ది విజయదశమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

ప్రతి హిందువు స్వదేశీ మరియు పర్యావరణ పరిరక్షణ ,కుటుంబ ప్రబోధ సామాజిక సమరసత, పౌర విధులు ఆచరణ వంటి ఐదు అంశాలు సమాజ మార్పుకు పునాదిరాళ్లవుతున్నాయన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ 100 ఏళ్ళు వేడుకల్లో ప్రతి కుటుంబ సమేతంగా భాగ్యస్వాములై ప్రతి ఇంటిపైన భగవద్వజాన్ని ఎగరవేయాలన్నారు. 1925 సంవత్సరములు దసరా పండుగ రోజు ఐదు మందితో ప్రారంభించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేడు దేశంలో వట వృక్షం లాగా శాఖ ఉప శాఖలుగా విభిన్న రంగాల్లో పనిచేస్తూ దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో అనేక దేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవ సంఘ స్తుందన్నారు హిందువుల ఐక్యతను శాఖ ఆధారముగా సంఘటితం అవుతుందన్నారు.

1930 సంవత్సరంలో కలకత్తాలో మేయర్ సుభాష్ చంద్రబోస్ ముందుండి దుర్గామాతను ప్రతిష్టించి ప్రజలచే పూజలు చేయించారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను పూజించడం మన హిందువులకు ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతి హిందువు విదేశీ సంస్కృతులను విడనాడి మన స్వదేశీ సంస్కృతిని కాపాడాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో మక్తల్ కండ సహ కార్యవాహ బాల్రాజ్ ఆర్య, గుంట గారి అశోక్ ,శంకర్ రోళ్ళ రవికుమార్, మాజీ సర్పంచ్ నరసింహులు, గుంట గారి నర్సింహులు, గుంట గారి క్రిష్టప్ప, శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి సుదర్శన్ గౌడ్, బసంత్ రెడ్డి, కరుణాకర్ లక్ష్మణ్ స్వామి, స్వయం సేవకులు స్థానిక ప్రజలు యువకులు తదితరులుపాల్గొన్నారు.