31-07-2025 12:00:00 AM
నాగార్జునసాగర్, జూలై 30: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్ , నల్గొండ జిల్లా డిగ్రీ కోర్సు లలో మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ఆగస్టు 6 వరకు పొడిగించారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి Ch.మాధవి లత తెలిపారు. డిగ్రీ డీఏఎస్‌టీ registration July 31 చివరి తేదీ. డీఏఎస్‌టీ registration పూర్తి అయిన విద్యార్థులు నేరుగా మా కళాశాల యందు అడ్మిషన్స్ పొందవచ్చు .
మా కళాశాల యందు నాణ్యతతో కూడిన విద్య, ఉచిత వసతి, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు, అనుభవజ్ఞులైన అధ్యాప కులచే విద్యా బోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక బోధన మరియు ఆటలలో ఆసక్తి కల విద్యార్థులకు ఫిజికల్ డైరెక్టర్ చే ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. వివరములకు 9640 811664, 9642046006, 94925 40363, 817665589 నంబర్స్‌ని సంప్రదించగలరు.