02-12-2025 05:09:44 PM
బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత..
అభ్యర్థి కాకులమర్రి శ్రీలత బ్రహ్మరథం పడుతున్న ఏటూరునాగారం ప్రజలు..
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు 3వ వార్డు 9వ వార్డు సభ్యులు బట్టు మానస గోపి పర్వతాలు ఎల్లయ్యతో కలిసి గ్రామపంచాయతీ అభ్యర్థి శ్రీలతతో ప్రచారం చేయటం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతతో ఇంటింటికి తిరిగి శ్రీలతక్కను గెలిపించుకోవాలని ప్రచారంలో పాల్గొన్నారు.
ఏ ఇంటికెళ్లినా ఏ గడప కెళ్ళినా గతంలో కాకులమర్రి కుటుంబం ఎన్నో సేవలందించారని మా బాబుకు ట్రీట్మెంట్ చేయించారు.. మాకు ఇల్లు వచ్చాయి.. మాకు స్థలాలు ఇచ్చారు.. మాకు ఏదో ఒక రకంగా సాయం అందించారని.. ప్రజలు స్వచ్ఛందంగా చెప్పటంతో కాకులమర్రి శ్రీలత గెలుపు సునాయాసంగా ఉంది అని ప్రజలు శ్రీలత అక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అంటున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ టౌన్ అధ్యక్షుడు కాజా పాషా తుమ్మ మల్లారెడ్డి కాకుల మరి ప్రదీప్ రావు కూనూర్ అశోక్ ఎండి వలీ బాబా కోనేరు నాగేష్ తాడూరి రఘు తూరం పద్మ ప్రమీల లలిత సఫియా సర్దార్ పాషా వెంకట్రావు నరసయ్య కుమ్మరి చంద్రబాబు గండేపల్లి నరసయ్య బాస పుల్లయ్య బాలకృష్ణ బాసాని శేఖర్ బట్టు గోపి పర్వతాలు ఎల్లయ్య జాడి భోజరాజు యలవర్తి శ్రీనివాసరావు గుండారపు శీను గుండారపు రాజు తాండ్ర విజయ్ బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.