12 March, 2026 | 10:43 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలి

02-12-2025 05:12 PM

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్..

కాటారం (విజయక్రాంతి): కాటారం మండలంలోని కొత్తపల్లి, చింతకాని, రేగులగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్  మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆయన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై ప్రత్యేకంగా ఆరా తీశారు. తూకం విధానం, తేమ కొలిచే పరికరాల పనితీరు, ధాన్యం నిల్వ సదుపాయాలు, గన్నీ సంచుల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు.

అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలన్నారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా పౌర సరఫరాల అధికారి  కిరణ్ కుమార్, తహసీల్దార్ నాగరాజు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.