calender_icon.png 25 August, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహ్లాదకరంగా ఆకట్టుకున్న రామగిరి ఖిల్లా

24-08-2025 10:42:22 PM

రామగిరి,(విజయక్రాంతి): ఎంతో ఆహ్లాదకరంగా  రామగిరి ఖిల్లా ఆకట్టుకున్నదని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతి ప్రసిద్ధిగాంచిన రామగిరి ఖిల్లా ను  ఆదివారం వీరు బుచ్చయ్య అధికారులతో కలిసి అధిరోహించారు. వారు ఖిల్లా పై ఏడు దర్వాజాలు, ఫసరుబాయి, అశ్వా శాల, ఫిరంగిలు, తోపాటు వాటిని పరిశీలించారు.

అనంతరం సీతారాములు సేద తీర్చిన ప్రదేశంలో రాములవారిని దర్శించుకోవడం జరిగిందని వీరబుచ్చయ్య తెలిపారు. రామగిరి ఖిల్లాపై ఆహ్లాదకరంగా ఉందని, చూడ ముచ్చటగా ఉందని పేర్కొన్నారు. ఇది పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం చేసేందుకు ముందుకు వచ్చిందని, దీనిలో భాగంగా తన వంతుగా కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తాము 13 కిలోమీటర్ల పాటు రామగిరి కిలపై వివిధ సుందరమైన ప్రదేశాలను చూడడం జరిగిందని, తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.