24-08-2025 10:59:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల్ కు చెందిన కారం శంకర్ తెలుగులో అనువదించిన ఉరి కంబం నీడలో ఒక బహుజనుడి ఆత్మకథ పుస్తకమును ఆదివారం ఆవిష్కరించినట్టు ఆయన తెలిపారు. రైటర్స్ అండ్ జర్నలిస్టు అసోసియేషన్ రాజా ఇండియా, తెలంగాణ యూనిట్, హైదరాబాద్, కవియాత్ర సంయుక్త ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోగల జర్నలిస్టు భవన్ సమావేశ మందిరములో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కే రాజన్న హిందీ ఫాంసీ నవలను తెలుగుభాషలో కారం శంకర్ అనువదించిన ఉరి కంబం నీడలో అను పుస్తకమును కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత,ప్రముఖ కవి నిఖిలేశ్వర్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రముఖకవి డా.మంగారి రాజేంద్ర జింబో,మహబూబ్ అదనపు కలెక్టర్,ప్రముఖకవి ఏనుగు నర్సింహ్మారెడ్డిలు ఆవిష్కరించారు. హిందీ మూలగ్రంథం రచయిత కే.రాజన్నను,తెలుగు అనువాదకర్త కారం శంకర్ లను రైటర్స్ అండ్ జర్నలిస్టు అసోసియేషన్, వాజా ఇండియా, తెలంగాణ యూనిట్ వారు ఘనంగా సన్మానించారు. కారం శంకర్ తనస్పందనలో తన అనుభవాలను చెప్పారు.