24-08-2025 10:47:00 PM
జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో ముదిరాజుల రాజ్యాధికారం లక్ష్యంతో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజుల పల్లె బాట కార్యక్రమం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. యువత ముందుకు వచ్చి రాజకీయాలలో రానించాలని నీలం మధు ముదిరాజ్ భరోసా ఉంటుంది అని తెలిపారు.