calender_icon.png 25 August, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్య పరిరక్షణే వైద్యుల భాద్యత...: జిల్లా న్యాయమూర్తి వీరయ్య

24-08-2025 10:30:20 PM

అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ముందడుగు...

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ 

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే లక్ష్యంగా...

ఐఎంఏ అధ్యక్షుడు పుజారి రమణ

మంచిర్యాల,(విజయక్రాంతి): వైద్య వృత్తి చాలా గొప్పదని, ప్రజారోగ్య పరిరక్షణే వైద్యుల భాద్యత అని జిల్లా న్యాయమూర్తి వీరయ్య పేర్కొన్నారు. వైద్య వృత్తి, నైతిక విలువలు, చట్టపరమైన సమస్యలపై అవగాహన కల్పించడానికి జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్ - పీసీడీ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. వైద్యుడు దేవునితో సమానమని అన్నారు. కొంత మంది అధిక డబ్బుల కోసం అనవసర వైద్యం చేస్తూ వైద్య వృత్తికి గ్రహణం పట్టిస్తున్నారన్నారు.

నకిలీ వైద్యులు, అర్హత లేని ఆసుపత్రుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ మెడికల్ కౌనికల్ సభ్యులని ఈ సందర్భంగా అభినందించారు. ప్రజారోగ్య పరిరక్షణ, నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు. న్యాయశాఖకు వైద్యులు ఇచ్చే ఖచ్చితమైన నివేధికతోనే కొన్ని కేసుల్లో నింధితులకు శిక్ష పడుతాయని, అందరు బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు.

అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్

అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని, వైద్య వృత్తిని ప్రక్షాళణ, నాణ్యమైన వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా చూడడటమే ప్రధాన లక్ష్యమని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ అన్నారు. అర్హత లేని వారు, అర్హత ఉండి మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేనివారు కూడా వైద్యం చేయడం నేరమేనని, వైద్య వృత్తిలో పరిదులు దాటి ప్రవర్తించినా, కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డదారిలో ధనార్జనే లక్ష్యంగా వ్యవహిరించే ఆసుపత్రులపైన మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

పల్లె ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పరిది దాటి వైద్యం చేయడం వల్ల ఎంతో మంది ఉన్న రోగం తగ్గకపోగా కొత్త రోగానికి ప్రాణం పోస్తున్నారన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీలు చేసి 540 మంది నకిలీ వైద్యులని, వందకుపైగా నాణ్యత లేని ఆసుపత్రులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే లక్ష్యంగా..: ఐఎంఏ అధ్యక్షుడు పుజారి రమణ

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని ఐఎంఏ అధ్యక్షుడు పుజారి రమణ అన్నారు. కొందరు కాసుల కోసం చీకట్లో అబార్షన్లు చేస్తూ వివాహేతర సంబంధాలను ప్రోత్సహిస్తు, అవసరం లేని వైద్యం చేస్తూ వైద్య వృత్తికే మచ్చ తెస్తున్నారన్నారు. వారిని గుర్తించి వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే ప్రధాన లక్ష్యంగా మెడికల్ కౌన్సిల్, ఐఎంఏ కలిసి కట్టుగా పనిచేస్తుందన్నారు.

కమిషన్ ఏజెంట్లుగా కొందరు అంబులెన్సు డ్రైవర్ లు, ఆర్ఎంపీలు పేద ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారని, అలాంటి వారి బెడద లేకుండా తక్కువ ధరకే సరైన వైద్యం అందించే విధంగా మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ వైద్య వృత్తిని వ్యాపారం చేస్తూ ప్రజారోగ్యానికి ముప్పు తెస్తే కఠిన చర్యలు తప్పవని నకిలీ వైద్యులని గుర్తిస్తూ మెడికల్ టాస్క్ ఫోర్స్ పని చేయడం చాలా గర్వకారణం అన్నారు.