24-08-2025 10:34:02 PM
కాల్వశ్రీరాంపూర్,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన కంటాల వీరయ్య బిఆర్ఎస్ కార్యకర్త కుమార్తె సంకీర్తన శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా ఆగస్టు 15న కళాశాలలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. ఆస్పత్రి వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించినప్పటికి కూడా వైద్యులకే అంతుచిక్కని వ్యాధితో గత పది రోజుల నుండి బాధపడుతూ ఉంది.
దీనికిగాను ఇప్పటివరకు దాదాపు రూ.10 లక్షల రూపాయల పైన ఖర్చు కావడంతో విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ మండల మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి వీరయ్య కుటుంబ పరిస్థితుల గురించి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తో విషయాన్ని వివరించగా ఆయన తక్షణమే స్పందించి ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి వీరయ్య కుటుంబాన్ని ఆదుకొని యశోద ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి తన వంతు సహకారంగా వెంటనే సంకీర్తనను డిశ్చార్జ్ చేసి, నేమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయించి, ప్రత్యేక వైద్య చికిత్సలు అందించే విధంగా కృషి చేశారు.
కార్యకర్త కుటుంబానికి అండగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి కాంతల వీరయ్య కుటుంబానికి సహాయం చేశారు. శనివారం నుండి వీరయ్య కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ వారి కుటుంబాన్ని భగవంతుడు ఆదుకోవాలని కోరుకుంటూ వింత వ్యాధితో బాధపడుతున్న కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, టిఎస్పిఎస్ మాజీ చైర్మన్ చిరిమల్ల రాకేష్ తదితరులు కోరుతున్నారు.