calender_icon.png 25 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ పరపతి సంఘం బలోపేతానికి కృషి

24-08-2025 10:49:27 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఆదివారం ఎర్రగట్టు గుట్ట సమీపంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హనుమకొండ గౌడ పరపతి సంఘం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ కట్టగాని రవీందర్ గౌడ్, తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని, ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. సొసైటీ అధ్యక్షులుగా కొయ్యడి గుంశావళి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గడిల వెంకన్న గౌడ్, కోశాధికారిగా తాళ్లపల్లి రాకేష్ గౌడ్ లు ఎన్నిక కావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గౌడ పరపతి సంఘం బలోపేతానికి కృషి చేస్తామని అని అన్నారు.