13 May, 2026 | 5:35 AM

రేపు సివిల్స్ విజేతలతో ముఖాముఖీ

24-04-2024 01:24 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23, (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాలులో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు బీసీ స్టడీ సర్కిల్, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ పేరుతో సివిల్స్ విజేతలతో ముఖాముఖీ కార్యక్రమం జరుగనున్నది. అనంతరం సివిల్స్ ర్యాంకర్స్‌ను గవర్నర్ సీపీ రాధాకృ ష్ణన్  సన్మానించనున్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి, టీఎస్ బీసీ స్టడీ సర్కిల్, డైరెక్టర్ డీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు.