13-11-2025 01:14:43 AM
పనులను డిసెంబర్20లోగా పూర్తి చేయాలి
మేడారం మాస్టర్ ప్లాన్‌పై త్వరలో సీఎం సమీక్ష
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మేడారం అభివృద్ధిపై అధికారులతో రివ్యూ
హాజరైన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్
ములుగు, నవంబరు 12 (విజయక్రాంతి): మేడారంలో సమ్మక్క, సారలమ్మ దేవాలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేప ట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తు లో 10 కోట్ల మంది భక్తులు వచ్చినా వసతు లు సరిపోయే విధంగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. మేడారం అభివృద్ధి, మా స్టర్‌ప్లాన్‌పై త్వరలో సీఎం సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎంత ఖర్చుఅయినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బుధవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంకు హెలికాప్టర్‌లో చేరుకున్న మంత్రి పొంగులేటి.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనా యక్‌లతో కలిసి సమ్మ క్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
అభివృద్ధి పనుల ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మేడారం హరిత కాకతీయ హోటల్‌లో సం బంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదార్లతో మేడారం అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రాకారం లోపల, సివిల్ పనులు, గద్దెల ఎత్తు పెంచడం, నిర్మా ణం ప్రధాన ద్వారాలు, ఆర్చ్, 4 వాచ్ టవర్లు, ప్రాకారనికి చుట్టూ సీసీ రోడ్డు పనులను సమాంతరంగా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలన్నారు.
దీనికితోడుగా గ్రీనరీ, ప్లాంటేషన్ చేయాలన్నారు. మేడారంలో రోడ్డు నిర్మా ణ పనులు డివైడర్లు, ప్లాంటేషన్ తో సహా నెల రోజుల్లో పూర్తి కావాలని సూచించారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మొదటి విడతలో క్యూ లైన్ షేడ్స్, 4 రోడ్డు లైన్ల విస్తరణ, టెంపర్ అభివృద్ధి, గద్దెల వద్ద భక్తుల సామర్థ్యం 3 వేల నుంచి 10 వేలకు పెంచనున్నట్లు తెలిపా రు. 19 ఎకరాలు భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జం పన్న వాగుపై చెక్ డ్యామ్‌ల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు తక్షణమే ప్రతిపాదన లు రూపొందించాలన్నారు.
శాశ్వత బస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించాలని సూచించారు. పశు సంవర్థక శాఖ ద్వారా 4అధునాతన పశు వదశాలల ఏర్పాటు చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఈ నెల 22న వస్తామని, నిర్దేశిత పనులు పూర్తి కావాలన్నారు. నాణ్యతలో రాజీపడేది లేదని, తేడా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతం గా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపట్టినట్టు పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు.
రాష్ర్ట పండుగగా గుర్తించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరా రు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..
గిరిజనుల సంప్రదాయ పద్ధతి ప్రకారమే గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, గిరిజనుల అస్తిత్వం, ఆత్మగౌరవానికి విలువ లు ఇస్తూనే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరో వారం రోజుల్లోగా గద్దెల ప్రాం తం ఒక రూపానికి వస్తుందని వివరించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరిష్ పాల్గొన్నారు.