calender_icon.png 6 May, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపర్చాలి

06-05-2025 12:00:00 AM

  1. ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ర్ట శాఖ డిమాండ్

నగర వ్యాప్తంగా ఆప్ ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ సర్వే

నివేదికను హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌కు అందజేత

ముషీరాబాద్, మే 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తమ క్షేత్రస్థాయి కార్యకర్తలు, యువ నాయకులతో కలిసి నగర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కార్యక్రమం చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ సెంట్రల్ జోన్ కమిటీ నాయకులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పా ల్గొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల సర్వే నివేదికను హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ డాక్టర్ జి.ముకుంద రెడ్డికి అందజేశారు. ఫిలింనగర్ రౌండ్ టేబుల్ గవర్నమెంట్ హై స్కూల్, హిమాయత్ నగర్ గవర్నమెంట్ హై స్కూల్లో విరిగిపోయిన, అపరిశుభ్రమైన మరుగుదొడ్ల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇది చాలా బాధాకరమని తెలిపారు. 1000 మందికి పైగా చదువుతున్న ఇలాంటి ఎన్నో బడులలో కేవలం ఒకటి లేదా ఇద్దరు ఆయమ్మ లు ఉండటం వలన మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచలేకపోతున్నారు.

పాఠశాలలో చదువుతున్న పిల్లల సంఖ్య అనుగుణంగా ఆయమ్మలను నియమించుకునేందుకు స్కూల్ మెయిన్టెనెన్స్ ఫండ్‌ను పెంచి హెడ్మాస్టర్లకు అందజేయాలని కోరారు. వేసవి సెలవులు ముగిసి మళ్లీ తరగతులు జూన్ 12 మొదలయ్యేలోపు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత సర్వే నిర్వహించి అందులో తరగతి గదులు, విరిగిన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఆటస్థలం పరి స్థితి మొదలైన లోపాలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అయమ్మల సంఖ్యను 150 మంది విద్యార్థులకు కనీసం 1కి పెంచాలన్నారు.

పాఠశాలలో ఉన్న అన్ని సీసీటీవీల పని స్థితిని పరిశీలించి, అవసరమైన చోట కొత్త కెమెరాలను ఏర్పాటు చే యాలన్నారు. సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు పాఠశాల ప్రాం గణాన్ని రాత్రిపూట చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిరోధించడానికి పాఠశాలల వద్ద రాత్రి భద్రతా గార్డును నియమించాలన్నారు.

పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఆక్రమణలను, ప్రవేశద్వారంలో ఉన్న అడ్డంకులను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆప్ సెంట్రల్ జోనల్ సభ్యులు విజయ మల్లంగి, జావిద్ షరీఫ్, బాబూలాల్ పవర్, సుధారాణి, షాబాజ్, లేయాకత్, అజీం బెగ్ పాల్గొన్నారు.