calender_icon.png 7 October, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుల సంఘ శ్మశానవాటికకు వసతులు కల్పించాలి

07-10-2025 12:00:00 AM

సూర్యాపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి) :  మునిసిపాలిటీలోని 22వ వార్డు మందుల వాడ సంఘానికి సంబంధించిన జమున నగర్ లో స్మశాన వాటికకు వసతులు కల్పించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత రెడ్డికి సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మందుల సంఘానికి  జమున నగర్ లో స్మశాన వాటిక భూమిని మంజూరు చేసినప్పటికీ వసతులు మాత్రం కల్పించకపోవడంతో అక్కడ చెట్లు పెరిగి క్రిమి కీటకాలు, పాములు చేరుతున్నాయన్నారు.

కావున దాని చుట్టూ ప్రహరీ నిర్మించి ఒక గేట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నీటి వసతి కోసం బోర్ వేయించి, కరెంటు మీటర్ బిగించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో 22వ వార్డు కార్యదర్శి పెండ్ర కృష్ణ, మైనార్టీ జిల్లా నాయకులు ఎండి పాషా, మహిళా సంఘం నాయకురాలు దేశ గని హేమలత, పెండ్ర చిన్న, గూడేలి శివ, పెండ్ర ప్రమోద్ తదితరులు ఉన్నారు.