4 May, 2026 | 7:25 PM

ప్రజలను ఆదుకోవడంలో విఫలం

03-09-2024 04:00 AM
  1. ఎకరానికి10 వేల పరిహారం చెల్లించాలె..
  2. ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి):  వరద బాధితులను ఆదుకోవ డంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రజలు  సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరుతో వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

ఇప్పటికీ తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తు న్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకుని వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవా లని, ప్రజలకు ఆహారం నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం రాష్ర్టం విష జ్వరాలతో విలువిలలాడుతున్నదని, వరదలతో వ్యాధులు మరింత విజృం భించే ప్రమాదం ఉందన్నారు. అన్ని శాఖలు అప్రమత్తం కావాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోని ఎకరానికి రూ. 10 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.