12 April, 2026 | 10:53 AM

కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌కు సోపానాలు

09-05-2024 12:51 AM

జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్, మే 8: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో వారి వైఫల్యాలే బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు సోపానాలు అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. బుధవారం జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్య ర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పాలనలోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మిమోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కర్త దేవీప్రసాద్, నాయకులు శివకుమార్, తంజీం, గుండప్ప, నామా రవికిరణ్, బండి మోహన్, అబ్ధుల్లా, మంజుల, తులసీదాస్ గుప్తా, మోహీజొద్దీన్, బాలరాజ్ పాల్గొన్నారు.