12 April, 2026 | 8:59 AM

ఆలోచించి ఓటు వేద్దాం

09-05-2024 12:49 AM

కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు

ప్రొఫెసర్ సుకుమార్

సంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓట్లు వేయాలని ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ పిలుపునిచ్చారు. జహీరాబాద్‌లో బుధవారం జరిగిన భారత్ జోడో అభియాన్ సదస్సులో పాల్గొని మాట్లాడారు. మోదీ సర్కార్ పదేళ్లలో ప్రజల సంక్షే మం కోసం ఏమీ చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెపుతున్నారని మండిపడ్డారు. ఇలా ప్రైవేట్ పరం చేస్తే రిజర్వేషన్లు ఎక్కడ అమలు చేస్తారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని నిలిపి వేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. విపక్షాలపై ఈడీ, ఐటీ పేరులతో దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ డబ్బులు వసూలు చేసిందన్నా రు. సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయవాది రమణరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డిక్కి అధ్యక్షులు జనార్దన్ పాల్గొన్నారు.