calender_icon.png 8 May, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

24-03-2025 10:56:14 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గుడిమల్ల చంద్రయ్య ఇంట్లో నకిలీ విత్తనాలు ఉన్నాయనే సమాచారంతో వ్యవసాయ అధికారి చల్ల ప్రభాకర్ తో కలిసి దాడులు చేయగా 50 కిలోల నకిలీ పట్టుబడ్డాయని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. వీటి విలువ రూ 1,25,000 ఉంటుందని చెప్పారు. ఈ సంఘటనలలో గుడిమల్ల చంద్రయ్య (కొండాపూర్), కూనారపు బాలకృష్ణ (తాండూర్ కిష్టంపేట), మొహమ్మద్ సాహెబ్ జానీ(మందమర్రి శ్రీపతి నగర్), ములకల సుధీర్ (మందమర్రి శ్రీపతి నగర్), గోవిందుల శంకర్ (1 జోన్, మందమర్రి)తో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని నేరస్తులు పరిగణించి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో దేవపూర్ ఎస్సై ఆంజనేయులుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.