calender_icon.png 11 September, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ మెచ్చేలా రోడ్డు వేయండి

10-09-2025 09:00:17 PM

సిసి రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అందరు మెచ్చేలా నాణ్యతగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని టిడి గుట్ట నుంచి కొత్త చెరువు రోడ్ వరకు 35 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్ లలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తున్నామని తెలిపారు.  గత పది సంవత్సరాలుగా మహబూబ్ నగర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు  మహమ్మద్ మునీర్ , చిన్న, ఖాజా పాషా , రాషెద్ ఖాన్, ప్రశాంత్ , శ్రీను, నాయకులు ఫక్రు, తదితరులు పాల్గొన్నారు.