calender_icon.png 7 May, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి అమ్ముతున్న నలుగురు యువకుల అరెస్ట్

24-03-2025 10:50:06 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తి వద్ద అక్రమంగా గంజాయిని అమ్ముతున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ఎన్. దేవయ్య సోమవారం రాత్రి తెలిపారు. ఎండి. తాజ్ బాబా (హనుమాన్ బస్తి), షేక్ ఇర్ఫాన్ బాబా (షంషీర్ నగర్), వాసాల గిల్ క్రిస్ట్ (తాండూర్ రాజీవ్ నగర్), సంతోష్ సమరద్ జాదవ్ (కాల్ టెక్స్ ఏరియా) లను అరెస్టు చేసినట్లు సిఐ చెప్పారు. వీరంతా గంజాయికి బానిసై మహారాష్ట్రలోని చంద్రపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని తక్కువ ధరకు కొని బెల్లంపల్లిలో ఎక్కువగా పట్టుకున్నట్లు సిఐ దేవయ్య చెప్పారు.