calender_icon.png 10 September, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతిపై వెళ్తున్న ఉపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు

10-09-2025 08:25:03 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై వెళుతున్న పినుమల్ల శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి మండల విద్యాధికారి దత్తు మూర్తి(Mandal Education Officer Dattu Murthy) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులను విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణ కలిగిన ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని ఆయన సేవలను కొనియాడారు. పాఠశాల నుండి బదిలీపై వెళ్లడం బాధాకరమైనప్పటికీ పదోన్నతిపై జైపూర్ జిల్లా పరిషత్ పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా వెళ్లడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి  హెచ్ఎం రాపిల్ రెడ్డి, ఉపాధ్యాయులు నరేందర్, రాజన్న, శ్రీనివాస్, సరూప్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ సంకె శ్రీనివాస్, మనబడి చైర్మన్ సుమలత, మాసు సంతోష్ కుమార్, గడ్డం శ్రీనివాస్, బొలిశెట్టి జనార్ధన్, నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.