calender_icon.png 11 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనలో ప్రావీణ్యత ఉండాలి..

10-09-2025 08:58:19 PM

- శిక్షణ పొందండి ఉపాధి మీ సొంతం 

- రూ 1 కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం:  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మనలో వ్యక్తిగత ప్రావీణ్యత ఉన్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు ఉన్నతంగా రాణిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. బుధవారం నగరం లోని వీరన్న పేట, సిరాజ్జుద్దిన్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో రూ 38.20 లక్షల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కేవలం బుధవారం రోజు మాత్రమే ముడా నిధులతో కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బికె రెడ్డి కాలనీలో ఇప్పటికే  వెయ్యి మంది మహిళలకు  వివిధ కోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించామని, మహబూబ్ నగర్ లో ఉన్న 30 వేల మంది మహిళా సంఘాల సభ్యులతో కలిసి మయూరి కో ఆపరేటివ్ సొసైటి ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా మీరు తయారు చేసే అన్ని రకాల వస్తువులను మయూరి సొసైటీ ఆధ్వర్యంలో విశ్వవ్యాప్తం చేస్తామన్నారు.

ఈ నైపుణ్య శిక్షణ కేంద్రం పూర్తి కాగానే  వీరన్న పేట పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని వార్డుల్లోని మహిళలు ఈ శిక్షణ సెంటర్ లో తప్పక శిక్షణ పొందాలని అందుకు సంబంధించి శిక్షణ రుసుమును నేనే చెల్లిస్తాననిహామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మోసిన్, మహమ్మద్ మునీర్, చిన్న, ఖాజా పాషా, రాషెద్ ఖాన్, ప్రశాంత్, లక్ష్మణ్ నాయక్, షేక్ ఉమర్ , అంజద్, నాయకులు లీడర్ రఘు, ఫైసల్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.