10-09-2025 08:32:03 PM
సిఐ రామకృష్ణారెడ్డి..
కోదాడ/నడిగూడెం: షీ టీమ్స్ ద్వారా మహిళలు రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, మహిళలు రక్షణే ప్రభుత్వ ధ్యేయమని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి(CI Ramakrishna Reddy) తెలిపారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు షీ టీమ్స్ చేపడుతున్న కార్యకలాపాలపై, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అన్నారు. కార్యక్రమంలో నడిగూడెం ఎస్ఐ జి అజయ్ కుమార్, కోదాడ సబ్ డివిజన్ షీ టీం ఎస్ఐ వి. మల్లేష్, ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, పోలీస్ సిబ్బంది, షీ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.