calender_icon.png 11 September, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాల్లోకి నిజమైన ఉద్యమకారులు ఆర్టీసీ ఉద్యోగులు

10-09-2025 09:02:07 PM

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ కు రూ.5 లక్షలు 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. నగరంలోని ఆల్మాస్ ఫంక్షన్ హాలులో జరిగిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మహా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర చాలా ప్రధానమైనదని, నిజమైన ఉద్యమకారులు మేరే అని ఆయన చెప్పారు. మీరు చేసిన పోరాటం వలననే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం చేసిందన్నారు. నాడు మీరు చేసిన పోరాటం వలననే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలిసిందని, నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నాడు అధికార పీఠం ఎక్కిన బిఆర్ఎస్ ప్రభుత్వం మీ సమస్యలను, డిమాండ్ లను పరిష్కారం చూపకపోగా మీపైన అక్రమ కేసులు పెట్టింది అని ఆరోపించారు. తాను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యల పరిష్కారానికి బాధ్యతతో పనిచేస్తానని ఆయన చెప్పారు.

నాడు ఉద్యమం సమయంలో సైనికుల్లాగా పనిచేశారని, నేను కూడా మీ సమస్యలను, డిమాండ్ లను పరిశీలించడం కోసం మంత్రులను కలిసి న్యాయం చేయడానికి సైనికుడిగా పనిచేస్తానన్నారు.  తెలంగాణ ఉద్యమకారుడిగా మీతోడు నిలబడి కొట్లాడుతానని, మీ సమస్యలు పరిష్కారించే వరకు విశ్రమించను అని  హామి ఇచ్చారు.  ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన విశ్రాంత ఉద్యోగులకు సూచించారు. అందుకు తన వంతుగా 5 లక్షల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ కు కేటాయిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు గోపాల్ యాదవ్, సిజె బెనహర్, ఐఎన్టియుసి రాములు యాదవ్, అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అంజద్, ఖాజా పాషా, రాషెద్ ఖాన్, ఆర్టీసీ నాయకులు సుధాకర్, ఎంవి కృష్ణ, నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, రాజ సింహుడు, రవీందర్ రెడ్డి, అంజన్న, జెఎన్ రెడ్డి, నారాయణ, లలితమ్మ, పాల్, తదితరులు పాల్గొన్నారు.