calender_icon.png 6 December, 2024 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామలో నకిలీ పోలీసుల అరెస్టు

08-10-2024 12:00:00 AM

జనగామ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): క్రైం బ్రాంచ్ పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను జనగా మ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ పార్థసారథి సోమవారం జనగామ పోలీస్ స్టేషన్‌లో నిందితులను మీ డియా ఎదుట ప్రవేశపెట్టి, వివరా లు వెల్లడించారు.

దేవరుప్పుల మం డలం గొల్లపల్లికి చెందిన నితిన్ తన స్నేహితులతో కలిసి గత శనివారం రఘునాథపల్లి మండలం నిడిగొండలో ఓ శుభకార్యానికి హాజరై, అదే రోజు రాత్రి తిరుగు పయనమయ్యా డు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయం లో యశ్వంతపూర్ పరిధిలో అదే గ్రామానికి చెందిన కా ముని వినయ్, యామంకి మధు అడ్డుకున్నారు.

తాము  క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పి వారికి పలు ప్రశ్నలు వేశారు. నితిన్ వద్ద రూ. 500 తీసుకుని, మరో రూ.800 ఫోన్ పే చేయించుకున్నా రు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యం లో ఇద్దరు నిందితులను సోమవా  రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద బైక్, రెండు మొబైల్ ఫోన్లు, రూ.500 రికవరీ చేశారు.