13-01-2026 12:00:00 AM
తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, కోమటిరెడ్డి యువసేన జిల్లా నాయకులు కేసాని రాహుల్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి12: తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి,కోమటిరెడ్డి యువసేన జిల్లా నాయకులు కేసాని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం అర్వపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మంత్రిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాహుల్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాజకీయాలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక చరిష్మా ఉన్న నేతని, ఎన్‌ఎస్యూఐ విద్యార్థి విభాగం నుండి ప్రస్థానం మొదలుపెట్టి యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఎంతో కష్టపడి అంచలంచలుగా ఎదిగాడని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న నేతపై ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదన్నారు.ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి, ప్రజలను మభ్యపెట్టే సోషల్ మీడియాను ఇకపై సహించేది లేదని,అవసరమైతే ప్రతి స్థాయిలో గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.