calender_icon.png 13 January, 2026 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి తర్వాత రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం

13-01-2026 12:00:00 AM

ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

మునుగోడు, జనవరి 12 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ అనంతరం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయమని, కరోనా కష్టకాలాల్లో కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఘనత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది అని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 90 మంది లబ్ధిదారులకు 2,45,2000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

ఓ వైపు అభివృద్ధి మరో వైపు తమ మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత ఖర్చు తో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి  అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు త్వరలోనే మంత్రి పదవి రాబోతుందని  నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడానికి  ప్రత్యేక స్టాఫ్ ని నియమించి సేవలందిస్తున్నారని, కరోనా కష్ట సమయంలో 7 కోట్ల రూపాయల నిత్యావసర సరుకుల పంపిణి చేసి నిరుపేదల ఆకలి తీర్చిన ఘనత రాజ్ గోపాల్ రెడ్డి అని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టు ఉన్న వారికి సీఎంఆర్ ఎఫ్ పై అవగాహన కల్పించాలని కోరారు. చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్  దోటి నారాయణ, జాల వెంకటేశ్వర్లు, బూడిద లింగయ్య, పాలకూరి యాదయ్య, నకిరేకంటి యాదయ్య, వేదిరే విజయేందర్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచులు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.