8 March, 2026 | 3:27 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

రిటైర్డ్ ఉద్యోగుల పట్ల అసత్య ప్రచారాలు తగదు

08-03-2026 01:55 PM

రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా 

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల వెయ్యి మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, వారి ఒక్కరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.కోటి చొప్పున నెలకు రూ.1000 కోట్లు అదనంగా ప్రభుత్వంపై భారం పడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఉటంకిస్తూ అసత్యాన్ని ప్రచారం చేయడాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీదర్ల ధర్మేంద్ర తీవ్రంగా ఖండించారు.

శనివారం హన్మకొండ లోని పి.ఆర్.టి.యు  భవనం లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అబ్దుల్ గఫార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మేంద్ర మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చెప్పిన అంకెలు నిజం కాదని, ఒక ఉద్యోగి పదవి విరమణ చేస్తే ప్రభుత్వం నుండి ఆ ఉద్యోగికి చెల్లించే డబ్బులు, గ్రాట్యుటీ ఎక్కువలో ఎక్కువగా కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే ఉంటుందని, జిపిఎఫ్ సగటున 10 లక్షల నుండి 25 లక్షల వరకు,లీవ్ ఇన్ క్యాస్మెంట్, జిఐఎస్ సగటున 6 నుండి 8 లక్షల  వరకు ఉంటుందన్నారు.

పెన్సన్ కమీటేషన్  అన్నది ఉద్యోగికి ప్రభుత్వం అప్పుగా ఇచ్చి ప్రతి నెల 15 శాతం తన పెన్షన్ లో జమ చేసుకుంటుంది అది( 15 లక్షల నుండి 25 లక్షల వరకు) సగటున 20 లక్షలు,ఇవన్నీ కలిపి ఉద్యోగికి సగటున 40 లకల నుండి 70 లక్షల వరకే  చెల్లింపులు జరగుతుందన్నారు. దానినే ముఖ్యమంత్రి ఒక్కరికీ కోటి అదనంగా ప్రభుత్వం కు  భారం పడుతుంది అనడం చూస్తే రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వారి వివక్షత కనపడుతుందన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ... రిటైర్మెంట్ (బెనిఫిట్స్)బకాయిల లో జిపిఎఫ్, లీవ్ ఇన్ క్యాస్మెంట్, జిఐఎస్ వంటివి సగటున 30 నుండి 40 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం వద్ద పొదుపు చేసుకున్నదేనని, ఈ డబ్బులు సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన రోజున చెల్లించాలి.

కానీ దురదృష్టం ఏమిటంటే ఉద్యోగి ఉద్యోగి పొదుపు చేసుకున్న ఈ డబ్బును ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టుకుని ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించ కుండా అసత్య ప్రచారాలు చేస్తూ ఉద్యోగుల ఉసురు తీస్తున్నదన్నారు.ఇక గ్రాట్యుటీ,పెన్షన్ కముటేశన్  నిబంధనలు ప్రకారం రిటైర్ అయిన 90 రోజులలో  చెల్లించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు  అయిన చెల్లించ కుండా అదనంగా వెయ్యి కోట్లు భారం పడుతుందని అసత్యాలు ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అక్టోబర్ నుండి ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నామని ప్రకటిస్తున్న అందులో కాంట్రాక్టర్ల కు,సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు పోను 200 కోట్లు మాత్రమే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తున్నారు. ఈ విధంగా చెల్లిస్తే రిటైర్మెంట్  బకాయిలు మేరు పర్వతం లా పెరిగి పోతుంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం అసత్యాలు మాని ఏక మొత్తము లో చెల్లించాలని, లేదా ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించి రిటైర్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, దేవదాస్, సూర కుమారస్వామి, మేకిరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.