21 May, 2026 | 3:18 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

బీసీ కమ్యూనిటీహాల్‌కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం

28-03-2026 12:29 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 27 (విజయ క్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ మరియు పంట పొలాల నిమిత్తం రోడ్డు కోసం భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం చేసినట్లు గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మి నారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...గోపాల్పేట గ్రామ వాస్తవులైన కీర్తిశేషులు పావుడాల కిషన్ ధర్మారెడ్డి గ్రామంలో తన సొంత ఇల్లును ఒక ఎకరం భూమిని 30 సంవత్సరాల క్రితం బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన ఇంటి స్థలం స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని,పంట పొలాలకు వెళ్లడానికి నిమిత్తం భూమిని ఇచ్చారన్నారు.

భూమి దానంగా ఇచ్చిన సందర్భంగా కీర్తిశేషులు పావుడాల కిషన్ వారసులు ఉన్నారని తెలుసుకొని ప్రవీణ్ కుమార్ రమేష్లను మర్యాదపూర్వకంగా శ్రీరామ నవమి సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానించి అభినందన తెలియజేశామన్నారు.

కీర్తిశేషులు అయిన పావుడల కిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మి నారాయణ, ఉప సర్పంచ్ జయరాజ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా,గ్రామ పెద్దలు శ్రీనివాస్,రాజాగౌడ్,కిష్టాగౌడ్, ఎల్లయ్య,దుర్గయ్య తదితరులు ఉన్నారు.