12-01-2026 12:40:02 AM
గజ్వేల్, జనవరి 11: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత అలవడుతుందని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం గజ్వేల్ నియజకవర్గం మర్కుక్ మండలం వరదరాజుపూర్ గ్రామంలో వరదరాజ స్వామి ఆలయంలో జరుగుతున్న లక్ష్మీ నారాయణ హావనం, లక్ష్యపుష్పార్చన కార్యక్రమంలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి గార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నీలం మధు విలేకరులతో మాట్లాడుతూ వరదరాజా స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కిష్టయ్య, ఆలయ కమిటీ చైర్మన్ ప్రొద్దుటూరి గోపాలకృష్ణ, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కనకయ్య గౌడ్, నాయకులు విజయ్ మోహన్, నర్సింలు,రవి,భగవాన్,మల్లేష్, స్వామి, అర్జున్, శేఖర్, మధు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.