calender_icon.png 6 July, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాపై రైతులకు అవగాహన

05-07-2025 08:10:05 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని బేతంపూడిలో ఇల్లందు నియోజకవర్గం ఆత్మ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో  నానో యూరియాపై ఆవశ్యకత గురించి రైతులకు వ్యవసాయ అధికారులు శనివారం అవగాహన  కల్పించారు. బేతంపూడి గ్రామానికి చెందిన సింగబోయిన రమేష్ పంటలో నానో యూరియా పిచికారి ప్రదర్శన చేయించడం జరిగిందన్నారు. నానో యూరియా పిచికారి చేయడం వలన, పూర్తి స్థాయి వినియోగం ఖరుగుతుందని రైతులకు తెలిపారు. బచ్చల కూరి అశోక్ కు చెందిన చేపల పంపకం, నీటికుంట వీలిన లాభాలు గురించి వివరించారు. మునగ మొక్కల పెంపకం గురించి,  తోటలో పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, ఏఈవో ఎన్ శాంత, సతీష్,  రైతులు పాల్గోన్నారు.