06-07-2025 12:39:53 AM
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే నిన్నటి సభ లో ప్రసంగిస్తూ బీజేపీ నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేం ద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు తన స్థాయి మరచి, ఇంతటి నీఛమైన వ్యాఖ్యలు చేసి, ఢిల్లీ లీడర్ కాస్తా గల్లీ లీడర్ స్థాయికి దిగజారిపోయారని ఒక ప్రకటనలో విమర్శించారు.
ఇది కాంగ్రెస్ పతనానికి మరో నిదర్శనమన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన సొంతమా.. లేక ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్ చదివారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వరుస వైఫల్యాలతో కట్టలు తెంచుకున్న అసహనంతోనే, తమ అధినాయకత్వా న్ని ఏమీ అనలేక, చేష్టలుడిగి బీజేపీపై విమర్శించినట్లు భావించాల్సి వస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం పీవోకేను స్వాధీనం చేసుకోకపోవడాన్ని ఖర్గే తప్పుబట్టడం హాస్యాస్ప దంగా ఉందన్నారు.
భారత్ ఆధీనంలో ఉం డాల్సిన కశ్మీర్ పాక్ పరమవడం కాంగ్రెస్ పాపమే కారణమన్నారు. మోదీ ప్రభుత్వం పహల్గాం దాడి తర్వాత పీఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. ఆపరే షన్ సిందూర్, అంతకుముందు బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రుక్స్.. మోదీ పాలనలో వృద్ధి చెందుతున్న భారత సామర్థ్యానికి నిదర్శనమన్నారు. యూపీఏ పాలన లో ఏనాడైనా ఉగ్రదాడులకు జవాబిచ్చారా అని ప్రశ్నించారు.
సెక్యులర్, సోషలిస్ట్ పదాల విషయంలో తప్పుదారి...
రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్, సోషలిస్ట్ పదాల విషయంలోనూ ఖర్గే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 1975లో ప్రతిపక్ష నాయలకు జైల్లో పెట్టి మరీ కాంగ్రెస్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో సవరణలు చేసిందన్నారు. పీఠికలో చేర్చిన సెక్యులర్, సోషలిస్ట్ పదాల గురించి బీజేపీ ఏనాడూ ఏమీ అనలేదన్నారు.
1949లో ఆమోదించిన రాజ్యాం గ పీఠికలోని మూల అంశాల్లో సోషలిజం, సెక్యులరిజం పదాలు భాగం కాదని, వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కొందరు ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు మాట్లాడటం వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. దీన్ని బీజేపీకి ఆపాదించడం బట్ట కాల్చి మీదెయ్యడమేనని స్పష్టం చేశారు.
హామీలు అమలు చేతకాక...
తెలంగాణలో 6 గ్యారెంటీలు, 420 హా మీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటీ అమలు చేయక ప్రజలను నిట్టనిలువునా మోసం చేసినట్లు కిషన్ రెడ్డి ఆరోపిం చారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 100 రోజు ల్లో అన్ని హామీలను అమలు చేస్తామని రాహుల్, సోనియా, ఖర్గే లేఖలు రాయడా న్ని, హామీ పత్రాలు ఇవ్వడాన్ని, అబద్దపు వా గ్దానాలు చేయడాన్ని ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు.