calender_icon.png 6 July, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకీతో మరోసారి

06-07-2025 12:43:09 AM

వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో అతి త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ చిత్రానికి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

ఇది వెంకీ మామ ఇమేజ్‌కు బాగా సూటయ్యే టైటిల్. టైటిల్‌ను బట్టి ఇదో ఫ్యామిలీ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతోంది. త్రివిక్రమ్ కూడా ఈ కథను ‘నువ్వు నాకు నచ్చావ్’లాగా హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయమై సినీవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేసులో త్రిష పేరు బాగా వినవస్తోంది. వెంకీ, త్రిషలది హిట్ కాంబో. ఇప్పటికే ఈ జంట ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘నమో వెంకటేశా’, ‘బాడీగార్డ్’ వంటి సినిమాలతో అలరించింది. ఇప్పుడిదే కాంబోను రిపీట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట త్రివిక్రమ్.

అయితే హీరోయిన్ డేట్లు బల్క్‌గా కావాలి.. మరి త్రిష కావల్సినన్ని డేట్లు ఇస్తుందా.. లేదా? అనేది అనుమానమే! మరోవైపు రుక్మిణి వసంతన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. రుక్మిణి కూడా ఫుల్ బిజీగా ఉంది. వెంకీతో రుక్ష్మిణి జోడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ ఇద్దరిలో ఒకరు ఖాయమయ్యే సూచనలున్నాయి. మొత్తానికి వెంకటేశ్ సినిమాకు సంబంధించిన పనులన్నీ చకచకా సాగుతున్నాయి. ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశమూ లేకపో లేదు.