06-07-2025 12:42:04 AM
ప్రజలకు శాపంగా మారిన డ్రైనేజీ సమస్య
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
కృష్ణానగర్ బస్తీల్లో పర్యటన
హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో బస్తీ బతుకులు బురదమయంగానే ఉన్నాయని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్‌లో శనివారం పర్య టించిన ఆయన, వర్షపు నీటితో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో ఇబ్బందుల పడుతున్న ప్రజలు నరకయాతనను స్వయంగా పరిశీలించారు.
అధికారుల మధ్య సమన్వయ లో పం, నిధుల కొరత వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ లో పనిచేసేవి ప్రధానంగా జీహెచ్‌ఎంసీ, వా టర్ వర్క్స్. ఈ రెండు శాఖలూ నిధుల లేమి తో ఇబ్బంది పడుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. అధికారులను సమస్య గురించి అడిగితే ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు.
సమన్వయ లోపంతోనే ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానగర్‌లోని మూడు వీధుల్లో నడిచి పరిస్థితిని సమీక్షించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. డ్రైనేజీ పొంగి మొత్తం మురుగు రోడ్డుపై పేరుకుపోయిందని. ప్రజలు బయటకు వెళ్లాలన్నా, పిల్లలు స్కూల్‌కు వెళ్లాలన్నా బురదలోనే నడవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
కృష్ణానగర్ నాలా అభివృద్ధికి శాశ్వత పరిష్కారం కోసం దాదాపు రూ. 9 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిధు లు కేటాయించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, వాటర్ వర్క్స్ ఎండీతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించి, శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి తన వైపు నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.