calender_icon.png 1 May, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి పోర్టల్‌తో రైతులకు మేలు

15-04-2025 01:19:26 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల్, ఏప్రిల్ 14 : భూ భారతి పోర్టల్ తో రైతులకు మేలు జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో భూ భారతి పోర్టల్ ప్రత్యేక్ష ప్రసారం స్థానిక రైతు వేదికలో వీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు భూ సమస్యలు లేకుండా భూ భారతి పోర్టల్ ను ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,  డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, ఏవో శ్రీలత, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాల్ రాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, బిక్యా నాయక్, చేగూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.