15-04-2025 01:18:28 AM
* బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి
* కామారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించిన పలు పార్టీల నాయకులు
కామారెడ్డి బృందం, ఏప్రిల్ 14( విజయ క్రాంతి),: అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడితే.. మానవుడే మహనీయుడవుతడాని బిజెపి రాష్ట్ర నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలో అంబేద్కర్ ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.
కామారెడ్డి జిల్లాలో వాడవాడల పట్టణాలు మండల కేంద్రాలు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. బిసి, ఎస్ సి, ఎస్ టీ మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కామారెడ్డి పట్టణంలో టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, షాదీపూర్ లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మమోహన్ రెడ్డి నూతన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు.