22-05-2025 12:00:00 AM
భైంసా, మే ౨౧ (విజయక్రాంతి): యాసంగిలో రైతుల పండించిన వరి ధాన్యం కొను గోలను వేగంగా చేపట్టాలని కోరుతూ బుధవారం లోకేశ్వరం కుంటాల నరసాపూర్ గ్రామాలకు చెందిన రైతులు అర్లీ ఎక్స్ రోడ్ వద్ద బైంసా రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన 100 మంది రైతులు రోడ్డుపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల వర్షాలు కురిసి పం ట తడిసిపోతుందని కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరో పిస్తూ ఆందోళన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడించి రాస్తారోకోను విరమిం పచేశారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ నేతలు మద్దతు పలికారు.