calender_icon.png 22 May, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి

22-05-2025 12:00:00 AM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సీతారాం

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 21(విజయక్రాంతి): జిల్లాలో ఈ నెల 28వ తేదీ వరకు ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సీతారాం అన్నారు.  బుధవారం ఆసిఫాబాద్ మండలం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంకుశాపూర్ ఉపకేంద్రంలో ఏర్పాటుచేసిన వ్యాధి నిరోధక  టీకాల కార్యక్రమాన్ని  నోడల్ అధికారి సంపత్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, టీకా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప పారామెడికల్ అధికారి శ్యాంలాల్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.