సంక్రాంతి తర్వాత రైతుభరోసా
ఖాతాల్లో జమచేసే బాధ్యత నాది
- మాది ప్రజాపాలన యజ్ఞం..
- మారీచుల మాట వినొద్దు
- రైతు రుణమాఫీ వంద శాతం పూర్తి
- 25.35 లక్షల మందికి 20,616 కోట్లు మాఫీ
- కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు 7,625 కోట్లు చెల్లించాం
- వచ్చే సీజన్‌లోనూ రూ.500 బోనస్ ఇస్తాం
- స్పష్టంచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
* ప్రజాపాలన యజ్ఞంలో రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రైతు రుణమాఫీ వంద శాతం పూర్తిచేశాం. మేము ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా మారు వేషంలో వచ్చే మారీచులు బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్లు అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మొద్దు.
* తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో 2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యత లు స్వీకరించారు. పదేళ్లు పాలించి గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ. 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. ఆ 7 లక్షల కోట్ల అప్పుకు ప్రతి నెలా అసలు, మిత్తి కలిపి రూ. 6,500 కోట్లు మా ప్రభుత్వం చెల్లిస్తోంది.
* దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా మా ప్రభుత్వం తక్కువ సమయంలో రూ.౨౦,౬౧౬ కోట్ల రుణమాఫీ చేసింది. 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశాం. ఇటీవల మరో ౩.౧౩ లక్షల మందికి రూ.2,747 కోట్లు మాఫీ చేశాం. దేశంలో ఇది ఓ గొప్ప రికార్డు.
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రజాపాలన యజ్ఞంలో రైతును రాజును చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రైతు రుణమాఫీ వంద శాతం పూర్తి చేశామని ఉద్ఘాటించారు. ప్రభు త్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా మారు వేషంలో వచ్చే మారీచులు బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్ల మాటలను నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు. ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు దాదాపు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు.
మరో 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగిందని స్పష్టంచేశారు. 2023 వానకాలం రైతు బంధును కేసీఆర్ ఎగ్గొట్టారని, తాము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు.
రైతు భరోసాకు సంబంధించి విధివిధానాలపై డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో వేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రు లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, దానం నాగేందర్, శ్రీగణేశ్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
సోనియాగాంధీ గ్యారెంటీగా ఇందిరమ్మ పాలనలో రైతు రుణమాఫీ పూర్తి చేశామని, సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతా ల్లో పడుతాయని పునరుద్ఘాటించారు. పాలమూరు రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతు లు రైతు పండుగలో పాల్గొన్నారని సీఎం పేర్కొన్నారు.
వాస్తవాల ప్రాతిపదికన తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుంటోందని చెప్పారు. రైతుల కోసం రాజకీయా లకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం కార్యక్రమాలను రైతులకు చేరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నెహ్రూ నుంచి నేటీ వరకు రైతులకు తొలిప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్సేనని స్పష్టంచేశారు. రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్ పదేళ్లు మోసం చేసిందని మండిపడ్డారు.
7 లక్షల కోట్లు అప్పు
ప్రత్యేక రాష్ట్రం రూ.16 వేలకోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో 2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారని రే వంత్‌రెడ్డి చెప్పారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ మాత్రం గతేడాదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రూ.7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసి న రూ.7 లక్షల కోట్ల అప్పుకు ప్రతి నెలా అస లు, మిత్తి కలిపి రూ. 6,500 కోట్లు తమ ప్రభు త్వం చెల్లిస్తోందన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందన్న సంగతి ఏ సందర్భంలో నూ కేసీఆర్, కేటీఆర్, ఆర్థికశాఖ మంత్రులుగా చేసిన హరీశ్‌రావు, ఈటల ప్రజలకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించామని సీఎం స్పష్టంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందోతో ప్రజలు అర్థం చేసుకోవాలని సూ చించారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పు ఉ న్నప్పటికీ తామిచ్చిన గ్యారెంటీలను అమలు చే స్తున్నామని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామ వెళ్లుతున్నామని వెల్లడించారు.
రూ.20,616 కోట్ల రైతు రుణమాఫీ దేశంలోనే రికార్డు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో రూ.20,616 కోట్ల రుణమాఫీ చేయలేదని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. దేశంలో ఇది ఓ గొప్ప రికార్డు అని చెప్పారు. 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామని వివరించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు నాలుగో విడత మహబూబ్‌నగర్‌లో రూ.2,747 కోట్లు మాఫీ చేశామని వెల్లడించారు. మొత్తంగా 25,35,964 మంది రైతులకు రూ. 20,616 కోట్లు రుణమాఫీ చేశామని సీఎం వివరించారు.
బీఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ రూ. 3,331 కోట్లే
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రెండుసార్లు కూడా రుణమాఫీ సరిగా చేయలేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏక మొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ౪ విడతల్లో చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో అవుటర్ రింగ్ రోడ్డును అమ్మి రూ.11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని, నాలుగున్నరేళ్లు రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ కింద రైతులు రూ.8,575.97 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని అన్నారు.
రుణమాఫీ కింద చెల్లించిన డబ్బుల్లో వడ్డీ కింద చెల్లించినవి పోగా రెండోసారి చేసిన రుణమాఫీ కేవలం రూ.3,331 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేసిందని స్పష్టంచేశారు.
వరి వేస్తే ఉరే అన్నారు
రైతులు వరి వేసుకుంటే ఉరేనని, వరి కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తామని కేసీఆర్ హెచ్చరించారని రేవంత్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రూ.500 బోనస్‌తో సన్న వడ్లను కొనుగోలు చేస్తుంటే కొందరు అపోహలు సృష్టిస్తున్నామని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని స్పష్టంచేశారు. వచ్చే సీజన్‌లోనూ సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చె ప్పారు.
తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో పంచాలని అనుకుంటున్నామని, సంక్షేమ, గురుకులాలు, ప్ర భుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్న బి య్యంతోనే మధ్యాహ్న భోజనం పెడుతామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్‌ఎంటీ లాంటి వంగడాలను వేస్తే ఎక్కువగా దిగుబడి వస్తుందని సూచించారు.
గుజరాత్ బానిస కిషన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విడుదల చేసిన ఛార్జిషీట్‌పై సీఎం స్పందిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గుజరాత్‌కు బానిస అని విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీ జేపీ గతంలో ఇచ్చిన హామీలపై చర్చకు సి ద్ధంగా ఉన్నారా? మా మంత్రులు చర్చకు వస్తారని సవాల్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రాష్ట్రం తేలిపోయిందని, రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూ స్తున్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అని రా ష్ట్ర బీజేపీ నేతలు మోదీని కలిసినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా? అంటూ ఎద్దేవాచేశారు.





