11 April, 2026 | 6:09 AM

హామీల అమలులో సర్కార్ విఫలం

02-12-2024 02:38 AM

బీజేపీ ఆందోళనలతోనే లగచర్లలో వెనకడుగు

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, డిసెంబర్ 1: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు హామీలు.. ఆరవైఆరు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను నట్టేట ముం చేలా హైడ్రా, మూసీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్ హోటల్‌లో ‘6 హామీ లు  66 అబద్దాలు’ అనే అంశంపై బీజేపీ శ్రేణులు, నాయకులతో ఎంపీ ఈటల ప్రత్యే క సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడు తూ.. రేవంత్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. బీజేపీ ఆందోళన లతోనే లగచర్లలో ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు సామ రంగారెడ్డి, నర్సింహారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అమరుల కుటుంబాలను ఆదుకోవాలి

తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు పోలీస్ కిష్టయ్య వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం ఎంపీ ఈటల రాజేదంర్ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించారు.