11 April, 2026 | 2:16 AM

వంకాయకూరలో పురుగు

02-12-2024 02:34 AM

లంగర్‌హౌస్  సురభి హోటల్‌లో ఘటన 

కార్వాన్, డిసెంబర్1: నగరంలోని హోటళ్లలో నిర్వాహకులు నాణ్యతను గాలికొదిలి జనాల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. కుళ్లిన మాంసం, పాడపోయిన కూరగాయలు వాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీఅధికాలు వరుస దాడులు చేస్తున్నప్పటికీ హోటళ్లు , రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు.

తాజాగా లంగర్‌హౌస్‌లోని సురభి హోటల్‌లో వంకాయ కూరలో పురుగు  ఇచ్చింది. కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి లంగర్‌హౌస్‌లోని సురభి హోటల్‌లో ఆదివారం రాత్రి భోజనం చేస్తుండగా వంకాయ కూరలో పురుగు కనిపించింది. విషయాన్ని అతడు హోటల్ యాజమాన్యానికి తెలియజేశాడు. పొరపాటున కూరలో పురుగు వచ్చిందని నిర్వాహకులు చెప్పడంతో ఏమీ అనకుంఆ అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాగా హోటల్‌లో ఉన్నవారంతా ఆహారంలో పురుగురావడంపై ఆందోళనకు గురయ్యారు. పురుగుల ఫుడ్ తిని ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మొద్దు నిద్ర వీడి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కోరారు.