23-12-2025 07:19:45 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పొలం వద్ద నాట్లు వేస్తున్న మహిళలు రైతు దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు పాల్గొని మహిళా రైతుల ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆల్ పోర్స్ పాఠశాల ఈ టెక్నో విద్యార్థులు పొలం వద్దకు చేరుకొని పనులను పరిశీలించి రైతులతో కలిసి పొలంలో నాట్లు వేసారు.
మహిళా రైతులతో కలిసి కేక్ కట్ చేసి, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని మహిళా రైతులు కోరారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ రైతుల కష్టం అపారమైనది అని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను మనం అనుభవిస్తున్నాం దాని వెనుక రైతు కష్టం చెప్పలేనిదన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, దేశం ఆకలి తీరుస్తున్న రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు బండ మాధవి, లక్ష్మి తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.