23-12-2025 08:20:45 PM
కాశీ విశ్వనాథ పీఠం స్థాపకులు శ్రీ దుర్గాపూర్ స్వామీజీ
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి పర్వతపూర్ లో శ్రీ కృష్ణ దత్త గోశాలలో గణపతి పూజ, రుద్ర హోమం, గోపూజ, గో హారతి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ స్వామీజీ మాత అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం స్థాపకులు, శ్రీ దుర్గాపూర్ స్వామీజీ, మేడ్చల్ బిజెపి ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి, చత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు యోగేష్ ప్రభు జీ, హిందూ ధర్మరక్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గోమాత ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ రక్షణకై పాటుపడాలని స్వామీజీలు తెలిపారు. కాశీ క్షేత్రంలో గంగానదికి హారతి ఇచ్చే పండితులు గోశాలలో గోమాతకు ఇచ్చిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో భక్తులు ఆధ్యాత్మిక భావనతో పరవశించినారు. హిందూ ధర్మ రక్షణలో అనేక ఆటపాట్లు ఎదురవుతున్న, వెనుకాడకుండా ధర్మరక్షణకు పాటుపడుతున్న హిందూ బాంధవులకు ధన్యవాదములు తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి హోమోర్చ జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.