calender_icon.png 23 December, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక , ఇతర ఖనిజాల అక్రమరవాణను నియంత్రించాలి

23-12-2025 07:57:57 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇసుక, ఇతర చిన్న ఖనిజాలపై జిల్లా సర్వే రిపోర్ట్ (DSR) తయారీ, దాని ఆమోదం స్థితి ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ రావణను నియత్రించడానికి జిల్లాలో ముఖ్యమైన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గత డీఎల్ఎస్సీలో ఉన్న అంశముల గురుంచి, మాగి, అచ్చంపేట్ గ్రామాలు, నిజాంసాగర్ మండలంలో ఉన్న ఇసుక లభ్యత గురుంచి క్లుప్తంగా చర్చించారు. ఈ సమావేశములో  అదనపు కలెక్టర్ విక్టర్,  సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషనల్ ఎస్పీ  నరసింహ రెడ్డి,  నాగేశ్, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖా, భూగర్భ జల శాఖ, ఇతర సంబధిత కార్యాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.